టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండెపాక ప్రభాకర్ 

విశ్వంభర, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తున్న యువ నాయకుడు  గుండెపాక ప్రభాకర్ ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (ఎస్సీ సెల్ ) నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో ప్రభాకర్ విశేష పాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన నిరంతర కృషి, నిబద్ధత, నాయకత్వ లక్షణాలను గుర్తించిన అధిష్ఠానం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తానని గుండెపాక. ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ కి అలాగే మానకొండూరు ఎమ్మెల్యే ఎస్సీ సెల్ తెలంగాణ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కి తెలంగాణ ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gundepaka-prabhakar-as-the-state-general-secretary-of-tpcc/article-20331

Tags: