డాక్టర్ మందా సురేఖ రెడ్డికి కళారత్న అవార్డు
విశ్వంభర, నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రానికి చెందిన ప్రధానో పాధ్యాయురాలు డాక్టర్ మందా సురేఖ రెడ్డి కి "కళా రత్న" అవార్డుతో ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమి ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్, యోగ ఎడ్యుకేషనల్ అకాడమీ తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆమెను సన్మానించి కళారత్న అవార్డుతో సత్కరించారు. మంద సురేఖ రెడ్డి మోటివేషనల్ స్పీచ్ లు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటి వాటితో సమాజాన్ని జాగృతం చేస్తున్నందుకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. గురు పౌర్ణమి సందర్భంగా గురువు విశిష్టత,జాతి నిర్మాణంలో గురువు పాత్ర చాలా గొప్పదని సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం వేదాలు పురాణాలు ఇతిహాసాలు, ఉపనిషత్తులు వాజ్మాయ సంపద భారత జాతిని సత్యం ధర్మం అనే రెండు అంశాలపై నడిపిస్తుందని ఆమె విశ్లేషణాత్మకంగా అందించిన వ్యాసాలు ప్రసంగాలతో ఆమె ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. గురువుకు సమాజంలో ఉన్న స్థానాన్ని విశ్లేషణాత్మకంగా వివరించడంలో ఆమె చూపిన ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. ప్రధాని మోడీ కలలు కన్నా విశ్వగురు స్థానాన్ని సాధించాలంటే గురువుల శిష్యుల శక్తి సామర్థ్యాలు దేశానికి అవసరమని శాస్త్ర సాంకేతిక విషయాలన్నీ వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలోనే ఉన్నాయని ఆమె వివరించారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ఫౌండర్, చైర్మన్, బిజెపి కల్చరల్ సెల్ కన్వీనర్ మానవ హక్కుల పరిరక్షణ కమిటీ కల్చరల్ కోఆర్డినేటర్ దేవాజ్ఞ సరస్వతి శర్మ, కేవీఎల్ నరసింహారావు తేలు విజయ, ప్రేమలత క్షీరసాగర్ రామకృష్ణ తదితర చేతిలో మీదుగా కళారత్న అవార్డును అందించి గజమాలతో సత్కరించి మెమొంటోను అందించారు. మంద సురేఖ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ముష్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. తనకు కళారత్న అవార్డు అందడం ఎంతగానో ఆనందం కలిగించిందని మంద సురేఖ రెడ్డి అన్నారు.