సాయిబాబా  ఆలయాన్ని  దర్శించిన నటి  పూనమ్ కౌర్ 

విశ్వంభర, సికింద్రాబాద్ :  గురుపౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికుమార్ ఆమెను పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ దైవసాక్షాత్కారానికి గురువే మార్గదర్శి అని, యువత భక్తి మార్గంలో పయనించాలని సూచించారు. శివరామ దీక్షితాచల పీఠాధిపతి, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ రాజయోగి అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాసు మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేసినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించినప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివరామ దీక్షితాచల పీఠాధిపతి డాక్టర్ చిక్కా దేవదాసు, హ్యాండ్లూమ్ డే రూపకర్త ఎర్రమాత వెంకన్న నేత పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/actress-poonam-kaur-visited-saibaba-temple/article-20237

Tags: