పోలీసులు, నార్కోటిక్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు
విశ్వంభర, చింతపల్లి: మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం చింతపల్లి పోలీసులు నార్కోటిక్స్ విభాగం అధికారులతో కలిసి బుధవారం మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో మండల కేంద్రంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్ అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి దుకాణాల్లో విక్రయిస్తున్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి, నిషేధిత మాదక పదార్థాల విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి, దుకాణదారులకు మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా నిల్వలు చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.