సుల్తానాబాద్ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం
- ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
విశ్వంభర, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిరియాల ఉమామహేశ్వరి (16), సుశీల ఆకృతి (8) మంగళవారం రాత్రి చిల్డ్రన్ హోమ్ ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లిపోయినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించి బాలికల ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన బాలికల గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే సుల్తానాబాద్ పోలీసులను లేదా సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: ఎస్‌ఐ, సుల్తానాబాద్: 8712656511, సీఐ, సుల్తానాబాద్: 8712656510.
బాలికల ఆచూకీ తెలిసిన ప్రజలు పై ఫోన్ నంబర్లకు లేదా సమీప పోలీసు స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించి దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు కోరారు.