బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ తాత్కాలిక ఎంపిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ నెం. 02/2026 ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఒక బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు, తమ అభ్యంతరాలను సంబంధిత ఆధార పత్రాలతో కలిసి 30 నుండి 31 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల లోపు వ్యక్తిగతంగా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు. 31న సాయంత్రం 5:00 గంటల తర్వాత అందిన అభ్యంతరాలు లేదా అదనంగా సమర్పించే ధృవపత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవని అధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.