అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

విశ్వంభర, జనగాం : జనగాం జిల్లా దేవరుప్పుల మండలం మన్ పహాడ్ గ్రామంలో మహిళా భవన్ సిసి రోడ్ , సైడ్ డ్రైనేజ్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మండలం లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు. మన్ పహాడు గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు, మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ మండల,యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న ,స్థానిక సర్పంచ్ పారేపల్లి బాలమ్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ జోగు యాకన్న ,గ్రామ శాఖ అధ్యక్షుడు దావుల యాకన్న,జిల్లా నాయకులు మండల నాయకులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులు  పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-yashaswini-reddy-laid-the-foundation-stone-for-development-programs/article-20276

Tags: