వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

  • బాబా ఆలయంలో భక్తుల సందడి

విశ్వంభర, చింతపల్లి: మండల కేంద్రంలోని భక్తుల కొంగు బంగారం శ్రీ సాయి సన్నిధిలో గురుపౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయినాథుని సహస్రనామాలతో సద్గురు శ్రీ సాయినాథునికి లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం యాగశాలలో పూర్ణాహుతి, సాయినాథునికి సహస్ర కలశాలతో భక్తులచే అభిషేకం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. సాయినాథునికి సహస్ర ఘటాభిషేకసహిత వరుణయాగ మహోత్సవము బుధవారం రోజున అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు, పూజలు, గురుపూజ, సాయిబాబా అష్టోత్తర శతనామార్చన, హారతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా, సాయినామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనుంజయ, కోమిరిశెట్టి వెంకటయ్య, కుంభం పుల్లారెడ్డి, వూరే క్రిష్ణయ్య, తడకమళ్ళ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/glorious-gurupurnami-celebrations/article-20329

Tags: