అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడిన ముఠా అరెస్ట్

  • 13 క్వింటాళ్ల వైర్లు, నగదు, వాహనాల స్వాధీనం

విశ్వంభర, చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో నిర్మాణంలో ఉన్న వెంచర్లలో కరెంటు స్తంభాల అల్యూమినియం వైర్లను దొంగిలిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితులు పగటి సమయంలో వెంచర్లలో రెక్కీ నిర్వహించి, రాత్రివేళ ఎవరూ లేని సమయంలో కరెంటు స్తంభాలపై ఉన్న అల్యూమినియం వైర్లను కత్తిరించి కార్లు, ట్రాలీల్లో తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. జూలై 25న చింతపల్లి మండలం రాయినిగూడెం శివారులోని ఓ వెంచర్‌లో జరిగిన వైర్ల దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 13 క్వింటాళ్ల అల్యూమినియం వైర్లు (విలువ సుమారు రూ.2 లక్షలు), రూ.1.80 లక్షల నగదు, ఒక స్విఫ్ట్ కారు, రెండు ట్రాలీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చింతపల్లి, మర్రిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి, మర్రిగూడ ఎస్‌ఐ రాంబాబు, పోలీసు సిబ్బంది కేసును ఛేదించగా, ఎస్పీ వారిని అభినందించారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gang-arrested-for-theft-of-aluminum-wires/article-20296

Tags: