వేతనాలు చెల్లించండి

వేతనాలు చెల్లించండి

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  తమకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని మండల ఫీల్డ్ అసిస్టెంట్లు సమీక్ష సమావేశాన్ని బహిష్కరించారు .  బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు . తాము ఉపాధి హామీ పథకంలో పనులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ఫోటో క్యాప్చర్ అటెండెన్స్ , వనమహోత్సవంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమను ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరమని అన్నారు. రెక్కాడితే  కానీ డొక్కాడని పరిస్థితులు తమ జీవితాలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే వేతనాలు మంజూరు చేయాలని వారు ఎంపీడీవో క్రాంతి కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pay-wages/article-20259

Tags: