అసైన్డ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, మొయినాబాద్: చేవెళ్ల నియోజకవర్గం లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్ అసైన్డ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సోమవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గౌతం కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తోల్కట్ట గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ వాగులకు సంబంధించిన భూములు, అసైన్డ్ రైతుల భూముల్లో వెంచర్లు వేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములలో పట్టా మార్పులు చేసి, హద్దులు తొలగించి అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములకు హద్దు బందులు ఏర్పాటు చేయడంతో పాటు, అసైన్డ్ రైతుల భూములకు కూడా స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. తోల్కట్ట గ్రామంలోని సర్వే నెంబర్ 124లో ఉన్న ఒక ఎకరం 20 గుంటల భూమిలో కొత్తగా వెంచర్ వేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై మొయినాబాద్ తహసీల్దార్ గౌతం కుమార్ సానుకూలంగా స్పందించి, పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు భానూరి శివశంకర్ గౌడ్ తెలిపారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/steps-should-be-taken-to-protect-assigned-lands/article-15361

Tags: