రెండేళ్ల అభివృద్ధి.. సుపరిపాలనపై ఎం.చెర్లోపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం
- ప్రజల వద్దకు వెళ్లిన నాయకులు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన
రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లి గ్రామంలో రెండేళ్ల అభివృద్ధి–సంక్షేమం–సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరపు మురళి అన్నగారు హాజరై గ్రామంలోని ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారూరు కేశవ, ఆదిశేషు కుమార్, బోయ గోపాల్, బోయ రాము, సర్పంచ్ బాబయ్య, మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, క్లస్టర్ బొగానేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.