కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీనివాస్

విశ్వంభర, బర్కత్‌పుర : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితుడినై భారతీయ జనతా పార్టీలో చేరినట్లు,  ప్రజాసేవను మరింత విస్తృతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రముఖ సంఘసేవకుడు, బిల్డర్ జి. శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదు  బర్కత్‌పురలో  నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో నాంపల్లి నియోజకవర్గం చెందిన  జి. శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కిషన్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అందిస్తోందని, ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో బీజేపీలో చేరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాసేవలో అనుభవం ఉన్న జి. శ్రీనివాస్ వంటి నాయకుల చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేయాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ గోపి, పవన్ కుమార్, శంభు సింగ్, వీరగిరి తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలరాజు తదితరులు పాల్గొన్నారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/srinivas-joined-the-bjp-in-the-presence-of-union-minister/article-19856

Tags: