అమ్మ వడి కోసం అనంతపురం కలెక్టరేట్‌కు ఒంటరిగా వచ్చిన అనాథ బాలిక.

  • బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థిని కీర్తి బాయి వినతి.
  • తల్లిదండ్రులు లేరని, తన సమస్య చెప్పుకునే వారు లేరని ఆవేదన.
  • అమ్మ వడి పథకం లబ్ధి కల్పించాలని కలెక్టర్‌కు అర్జీ.
  • మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి.

Anantapuram Collector: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ స్కూల్‌లో చదువుతున్న కీర్తి బాయి అనే బాలిక తనకు 'అమ్మ వడి' పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసింది. తల్లిదండ్రులు లేకపోవడంతో తన సమస్యను చెప్పుకునే వారు ఎవరూ లేరని, అందుకే ఒంటరిగానే కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించినట్లు బాలిక తెలిపింది.

మీడియాతో మాట్లాడిన కీర్తి బాయి, తనకు తల్లిదండ్రులు లేరని, తన సంక్షేమం గురించి పట్టించుకునే వారు కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. అర్హత ఉన్నప్పటికీ తనకు అమ్మ వడి పథకం లబ్ధి అందలేదని పేర్కొంది. తన పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం స్పందించాలని కోరింది.

Read More సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దివ్యాంగురాలిపై దాడి.. న్యాయం ఎక్కడంటున్న బాధితులు

మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ తన సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తనకు అమ్మ వడి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని బాలిక విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కదిలించగా, బాలికకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

అమ్మ వడి కోసం అనంతపురం కలెక్టరేట్‌కు ఒంటరిగా వచ్చిన అనాథ బాలిక.

Anantapuram Collector: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ స్కూల్‌లో చదువుతున్న కీర్తి బాయి అనే బాలిక తనకు 'అమ్మ వడి' పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసింది. తల్లిదండ్రులు లేకపోవడంతో తన సమస్యను చెప్పుకునే వారు ఎవరూ లేరని, అందుకే ఒంటరిగానే కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించినట్లు బాలిక తెలిపింది.

మీడియాతో మాట్లాడిన కీర్తి బాయి, తనకు తల్లిదండ్రులు లేరని, తన సంక్షేమం గురించి పట్టించుకునే వారు కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. అర్హత ఉన్నప్పటికీ తనకు అమ్మ వడి పథకం లబ్ధి అందలేదని పేర్కొంది. తన పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం స్పందించాలని కోరింది.

మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ తన సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తనకు అమ్మ వడి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని బాలిక విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కదిలించగా, బాలికకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/the-girl-begged-the-collector-to-give-me-my-mother/article-19788

Tags: