సదాశివపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం ప్రారంభం
- ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఆధ్వర్యంలో శిశిర హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు
విశ్వంభర, సదాశివపేట: శిశిర హాస్పిటల్ సహకారంతో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సింధు మాధవనేని పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు మహిళలు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి అవసరమైన వంటశాల (కిచెన్), గోదాముల నిర్మాణాన్ని ఎంపీ నిధుల ద్వారా చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల వివరాలు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు కె. శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, కర్ణ ఆదిత్య, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు ఉషన్న, శ్రీశైలం, కావలి అనిత, నామ హరీష్, ఉక్కిస భరత్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొర్లిల్ల శివలింగం, సీనియర్ నాయకులు తోట చంద్రశేఖర్, శ్రీకాంత్ రాజ్, శ్రీశైలం యాదవ్, గణపురం చంద్రశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.