బాల్య వివాహాలు చట్ట పరంగా నేరం
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు
విశ్వంభర, మహబూబాబాద్: చదువుకునే వయస్సులో విద్యాభ్యాసం చేయాలని బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు సూచించారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రం లోని స్థానిక బాలల సదనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు కమల్ కుమార్, సునీత గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు పిల్లలతో మాట్లాడుతూ, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనందున పిల్లలందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువు ఒక్కటే భవిష్యత్తును మారుస్తుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి పట్టుదలతో చదవాలని పిల్లల్లో ధైర్యాన్ని నింపారు. పాఠశాల ఆవరణలో గానీ, లేదా పాఠశాలకు వెళ్లే దారిలో గానీ ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఎంతమాత్రం సహించవద్దని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే న్యాయ సేవ సంస్థకు గాని, సదనం నిర్వాహకులకు గానీ, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.చట్టం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాల్య వివాహ బాధితులు ధైర్యం కోల్పోకుండా చదువుపై ఏకాగ్రత నిలపాలన్నారు.ఈ కార్యక్రమం లో సదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి, పాల్గొన్నారు.