ప్రత్యేక విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్: కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారి, అన్ని మండల విద్యాశాఖ అధికారులతో కలసి శుక్రవారం  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 11 నుండి 17 వరకు జరిగే ప్రత్యేక విద్య వారోత్సవాల నిర్వహణ, విద్యాశాఖ పై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విద్య వారోత్సవాల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 1వ రోజు ప్రారంభోత్సవాలు మైనర్ రిపేర్లు చేపట్టిన వసతుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపు ల నిర్వహణ, పీఎం శ్రీ పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు, 2వ  రోజు పదవ తరగతి, ఇంటర్మీడియట్ రీమెడియన్ క్యాంపుల నిర్వహణ, ప్రతి సబ్జెక్టు వారీగా నిపుణుల చేత బోధనలు, హాజరు శాతం పర్యవేక్షణ పురోగతిపై సమీక్ష మధ్యాహ్న భోజనం అందించుట, ఏడిస్తాయి అధికారి చేత పర్యవేక్షణ కార్యక్రమాలు,3,వరోజు సర్పంచులతో పాఠశాల విద్యా కార్యక్రమాలపై వర్క్ షాప్, మండల స్థాయిలో కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారం, 4వ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, ర్యాలీలు, తల్లిదండ్రుల సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం, పుస్తక ప్రదర్శనలు, ఉత్తమ పాఠకుల గుర్తింపు, బుక్ టాక్ కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీ శిబిరాలు, 6వ రోజు కలలు హస్తకళలు సంస్కృతిక దినోత్సవ కార్యక్రమాలు, చిత్రలేఖనం, హస్తకళలు, కోలాటం, ఒగ్గు కథ, సాంప్రదాయ కళా ప్రదర్శనలు, దివ్యాంగ విద్యార్థుల కళాఖండాల ప్రదర్శన, ఉత్తమ విద్యార్థుల గుర్తింపు సన్మానం, 7వ రోజు విద్య విజయోత్సవ దినోత్సవం , విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మాన కార్యక్రమాలు, ప్రతి విభాగానికి సంబంధించి ముగ్గురు టాపర్లను పురస్కారం, ప్రజా ప్రతినిధులు అధికారులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు . షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ప్రతి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించాలని, కార్యక్రమాలకు సంబంధించి వీడియో ఫోటో డాక్యుమెంటరీ రెడీ చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం కు ప్రాధాన్యత కల్పిస్తూ విద్యార్థులకు ఇంగ్లీష్ భాష పై పట్టు వచ్చే విధంగా మాట్లాడాలని తద్వారా వారి భవిష్యత్తుకు కార్యచరణ ప్రణాళికా ప్రకారం  నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పీఎం శ్రీ పాఠశాలల లో ఉన్న విధంగా ప్రతి పాఠశాలలో క్రమశిక్షణ పట్టుదల ప్రతి సబ్జెక్టు పై నాలెడ్జ్ తో కూడిన, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మదర్, విద్యాశాఖ ప్లానింగ్ ఏసీజీ విభాగాల అధికారులు శ్రీరాములు, అప్పారావు, పూర్ణచందర్, సంతోష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-education-weeks-should-be-celebrated/article-15161

Tags: