సీపీఎం నాయకుడు మహేందర్ తల్లి మృతి
On
విశ్వంభర, అంబర్ పేట: సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు మహేందర్ తల్లి సత్యమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. విషయంతెలిసిన వెంటనే కాచిగూడ కృష్ణానగర్ లోని వారి నివాసానికి చేరుకొని సీపీఎం నాయకులు, సన్నిహితులు స్నేహితులు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు జయ వెంకటేష్, నగర కార్యదర్శి వెంకటేష్, శ్రీనివాసరావు, దశరథ్ , హరి, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.



