ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఇనగాల

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఇనగాల

విశ్వంభర, హనుమకొండ:  జక్రియా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  హనుమకొండ డీసీసీ  అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.  ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, వారితో మమేకమై పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ మైనారిటీ నాయకులు,కార్పొరేటర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  మాట్లాడుతూ,  రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, సోదరభావానికి నిదర్శనమని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అన్ని వర్గాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతూనే, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కృషితో ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ ఒకే చోట చేరి విందు ఆరగించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనారిటీ నేతలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: