సన్న బియ్యం పంపిణీకి సంవత్సరం పూర్తి

సన్న బియ్యం పంపిణీకి సంవత్సరం పూర్తి

  • వినూత్నంగా విజయోత్సవ వేడుకలు

 విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం  విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే  బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో వినూత్నంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్,. ఆయనతో స్థానిక మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా , వైస్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి శిరీష నవీన్ పాల్గొని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద ప్రజలకు అందుతున్న మేలును చాటిచెప్పేలా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ )  తన క్యాంపు కార్యాలయంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య లబ్ధిదారుల సరసన కూర్చుని సహపంక్తి భోజనం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రజల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ, *“అందరం ఒకటే” అనే భావనను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. భోజన విందు అనంతరం పేదల సంక్షేమం దిశగా మరో ముందడుగు వేస్తూ, (సి ఎం ఆర్ ఎఫ్ )సీఎం రిలీఫ్ ఫండ్  మరియు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ. 2 కోట్లు 55 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

Tags: