అభివృద్ధి పనుల పరిశీలన    

అభివృద్ధి పనుల పరిశీలన    

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని కుట్టు మిషన్ కేంద్రం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఐకేపీ సెంటర్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొన్నారు. 4వ వార్డులోని బోర్ వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను, నర్సరీలో కోతుల సమస్యల నుండి మొక్కల రక్షణ కోసం చర్యలు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, ఇతర వార్డులలో డ్రైనేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: