లారీ డ్రైవర్ కు ఏడు నెలల జైలు శిక్ష
విశ్వంభర, చింతపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణానికి కారకుడైన లారీ డ్రైవర్ కు ఏడు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్టు చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలం పోలేపల్లి రామ్ నగర్ గ్రామానికి చెందిన కోప్పుల నారాయణ 2017వ సంవత్సరంలో తన లారీని అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో వస్కుల కేశవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై నాగభూషణరావు కేసు నమోదు చేసి కోర్టులో చార్ సీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దేవరకొండ మేజిస్ట్రేట్ కెవిఎస్ హరిబాబు సాక్షాదారాలను పరిశీలించి నేరస్తుడైన కొప్పుల నారాయణకు ఏడు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. ఏపీపీ సంతోష్ కుమార్ వాదనలు వినిపించగా వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్టు తెలిపారు. కేసు విషయంలో సహకరించిన చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి, కోర్ట్ కానిస్టేబుల్ నగేష్, లైజర్ శ్రావణ్ కుమార్ లను ఎస్పీ అభినందించారు.