హైదరాబాద్ పాతబస్తీలో విషాదం: కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
విశ్వంభర, హైదరాబాద్: పాతబస్తీ పరిధిలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు నీటిలో పడటంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, ఇద్దరూ ఆటోలో వచ్చి రాయల్ సీ హోటల్ సమీపంలో దిగారు. అయితే భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగి నీటిలో పడిన విషయాన్ని వారు గమనించలేదు. నీటిలో కాలు వేయగానే విద్యుత్ ప్రవాహం సోకి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో జాఫర్ అక్కడికక్కడే మృతి చెందగా, అబూను స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయించి చికిత్స కోసం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అబూ కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, వర్షాకాలంలో విద్యుత్ తీగల భద్రతపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.