డల్లాస్ లో బోనాల ఉత్సవాలకు కేటీఆర్ కు ఆహ్వానం
విశ్వంభర, ముషీరాబాదు : డీటాబ్స్ ఆర్గనైజేషన్ డల్లాస్ తెలుగు అలైబలై సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్ ఆనంద్ దేశి సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును హైదరాబాదులోని ఆయన నివాసంలో ముషీరాబాదు ఎమ్మెల్యే ముఠాగోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జై సింహ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డల్లాస్ లో ఆగస్టు నెలలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను కెటిఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ ఆనంద్ దేశి కి కేటీఆర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆగస్టులో జరిగే బోనాల ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ ఆనంద్ దేశి మాట్లాడుతూ... హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ కు చెందిన తాను డల్లాస్ లో నివసిస్తూ 2025లో డీటాబ్స్ ఆర్గనైజేషన్ డల్లాస్ తెలుగు అలాయ్ బలై సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘాన్ని కేటీఆర్ లాంచ్ చేశారన్నారు. ఆగస్టులో బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని కేటీఆర్ ను ఆహ్వానించడం జరిగిందన్నారు.