దేవుని ఆలయం కోసం కేటాయించిన భూమి దేవాలయానికి దక్కాలి.  

  • -గ్రామ పెద్దల డిమాండ్ 

విశ్వంభర, మహబూబాబాద్ :- కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి  దేవాలయం కోసం కేటాయించిన భూమిని కొందరు బ్రాహ్మణులు ఆక్రమించాలని చూస్తున్నారని, ఆ భూమినీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే చూస్తూ ఊరుకోమని గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు.  అనేక   సంవత్సరాల కిందట దేవాలయం కోసం కేటాయించిన భూమి కొందరు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఆక్రమించాలని చూస్తున్నారన్నారు.  ఈ భూమి దేవాలయ అభివృద్ధి కోసమే కేటాయించాలని దీని కోసం ఎక్కడికైనా వెళ్దామని వారు అన్నారు ఈరోజు బ్రాహ్మణులు పెట్టిన అక్రమ కేసు పై కోర్టుకు హాజరై పై విధంగా డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రావుల రవిచంద్ర రెడ్డి, గొర్రె వెంకన్న, బండి శ్రీను, గోడిశాల వెంకన్న, నరేటి కొమర, నార్ల రమేష్, మాచర్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

🕒 12 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-land-earmarked-for-the-temple-of-god-should-go/article-15303

Tags: