శివగంగ ఆలయం సమీపంలోని డంపింగ్ యార్డ్ తొలగించాలి
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గద్దగూటి మహేందర్ ముదిరాజ్
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని మొదటి వార్డులో శివగంగ ఆలయం, స్థానిక కాలనీల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గద్దగూటి మహేందర్ ముదిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్‌ను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివగంగ ఆలయం చుట్టుపక్కల ప్రజల నివాసాలు ఉండగా, మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందే అక్కడ చెత్తను డంప్ చేయడం వల్ల దుర్వాసన, దోమలు, ఈగల సమస్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయే సమయంలో బయటకు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శివగంగ ఆలయానికి వచ్చే భక్తులు కూడా భరించలేని దుర్వాసన కారణంగా అసౌకర్యానికి గురవుతున్నారని, అయినప్పటికీ సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆలయం ఒకవైపు, ప్రజల నివాసాలు మరోవైపు ఉండగా మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏ విధంగా సమంజసమో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసన మరింత పెరిగే ప్రమాదం ఉందని, దీంతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని మహేందర్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, డంపింగ్ యార్డ్‌ను అక్కడి నుంచి తరలించి పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన గ్రామపంచాయతీ సిబ్బందే నివాస ప్రాంతంలో చెత్త వేయడం సరైన చర్య కాదని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించిన ఆయన, గ్రామపంచాయతీ పాలకవర్గం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.