బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ అండ

బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ అండ

  • ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా సంప్రదించాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

విశ్వంభర, పెద్దశంకరంపేట: బాలికల భద్రతకు పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి విద్యార్థినికి ‘పోలీస్‌ అక్క’ అండగా నిలుస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ‘పోలీస్‌ అక్క’ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, విద్యార్థినుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ‘పోలీస్‌ అక్క’లు కృషి చేస్తారని తెలిపారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా రక్షణ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్ పరిధికి కానిస్టేబుల్ గౌతమిని ‘పోలీస్‌ అక్క’గా నియమించినట్లు ప్రకటించి, ఆమె ఫోన్ నంబర్‌ను విద్యార్థినులకు అందజేశారు. విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలను గోప్యంగా తెలుసుకుని, అవసరమైన సహాయం అందించడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సమస్యలను దాచిపెట్టకుండా నేరుగా ‘పోలీస్‌ అక్క’ను కలిసి లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–112, షీ టీమ్స్ సేవలను వినియోగించాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ వారితో స్నేహపూర్వకంగా మమేకమవుతారని, వారి సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారని ఎస్పీ తెలిపారు. గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా దాచిపెట్టకుండా ‘పోలీస్‌ అక్క’కు తెలియజేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. విద్యార్థినుల భద్రతకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐలు శంకర్, ప్రవీణ్‌రెడ్డి, పోచయ్య, ‘పోలీస్‌ అక్క’ గౌతమి, పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/police-akka-is-there-for-girls-safety/article-19734

Tags: