ఎస్‌ఐఆర్ లో అందరూ భాగస్వాములు కావాలి: నవీన్ నాయక్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే వెన్నెముక, ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా భాగస్వామి కావాలని హైదరాబాదు బాగ్ లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ నాయక్ పిలుపునిచ్చారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్ లింగంపల్లిలో ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కేవలం ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సూచించారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, యువత, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు, సవరణ, మార్పులు, తొలగింపుల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ ప్రక్రియను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రజల హక్కులను కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటేనని నవీన్ నాయక్ అన్నారు. ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు కావడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని అర్హులందరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించి, అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పిలుపునిచ్చారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/naveen-naik-says-everyone-should-be-involved-in-sir/article-19730

Tags: