ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట : బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు ఒక్కరోజు విద్యాబుద్ధులు నేర్పారు. జిల్లా కలెక్టర్ పూజ , డిప్యూటీ కలెక్టర్ గా రాగవి, డి ఈ ఓ గా రాధిక, డిప్యూటీ డిఇఓగా అయోష, ఎంఈఓ నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయులుగా కీర్తన, ఉపాధ్యాయులుగా సరళ, మానస, అఖిల, శ్రీవల్లి, వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు నాగవేణి, రాధిక, అశ్విని, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.