సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ ను జూన్ లోగా పూర్తి చేయాలి

సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ ను జూన్ లోగా పూర్తి చేయాలి

  •   జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ 

  విశ్వంభర, జీహెచ్ఎంసీ : ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్ కీలకమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్  పేర్కొన్నారు. అవసరమైన సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో ఉంచి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మొత్తం మీద, పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావడమే ఆయన ప్రధానంగా చెప్పారు. చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ  పనులను జూన్ లోగా పూర్తి చేయాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం నిర్మాణంలో ఉన్న సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పనులను మరింత స్పీడ్ అప్ చేయాలని అధికారులకు సూచించారు. ఫ్లై ఓవర్ పనుల పూర్తికి జూన్ ను డెడ్ లైన్ గా పెట్టుకోవాలన్నారు.తనిఖీలో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

Tags: