ఎక్స్పైరీ డేట్ ముగిసిన ఫెస్టిసైడ్స్..కాలువలో పడే శారు..
- ఫర్టిలైజర్ షాపు నిర్వాకం..
విశ్వంభర, ఇనుగుర్తి: ఎక్స్పైరీ డేట్ ముగిసిన పెస్టిసైడ్స్ మందుల కాటన్ డబ్బా ఎస్సారెస్పీ కాలువలో విసిరి పారేసిన ఉదంతం ఇనుగుర్తి మండలం చిన్ననాగారం సమీపంలోని ఎర్రబెల్లి గూడెం రోడ్డు వైపు శ్రీరాంసాగర్ డిబిఎం 48,10 ఆర్ 1 కెనాల్ వద్ద చోటు చేసుకుంది. విషపూరితమైన ద్రావణాల ప్లాస్టిక్ డబ్బాలను బాధ్యతారహితంగా కాలువలో వేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పని సమీపంలోని పురుగు మందులు,ఎరువుల విక్రయ షాపుల నిర్వాహకమేనని రైతుల తో పాటు వివిధ వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పెస్టిసైడ్ పత్తి, వేరుశనగ ఇతర పంటలలో కలుపు నివారించేందుకు పిచికారి చేసే పెండి మెథలిన్ ద్రావణ మందు. ఎక్స్పైరీ డేట్ 2023 తో ముగిసింది. కాలం చెల్లిన మందులను కంపెనీకి తిరిగి పంపాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలువలో విసిరివేయడం ప్రాణాలతో చెలగాటమాడుటమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో వర్షాలకు కాలువలో నీరు ప్రవహించి సంబంధిత ప్లాస్టిక్ డబ్బాలు డామేజ్ అయితే అందులోని విషపూరితమైన మందు నీటిలో కలిసి పశువులు ఇతర మూగజీవులు సంబంధిత నీటిని తాగి చనిపోయే ప్రమాదముంది. వ్యవసాయ శాఖ తో పాటు పోలీసు శాఖ అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెస్టిసైడ్స్ షాపును గుర్తించి షాపును సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.