నకిలీ ఉద్యోగ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి
విశ్వంభర, హైదరాబాదు : అడ్డదారులు వద్దు… కష్టపడండి… ఆర్టీసీ కొలువులు సాధించండని టీజీఎస్ ఆర్టీసీ వీసీ , ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత నకిలీ ఉద్యోగ ఆఫర్లకు లోనై మోసపోవద్దని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగాల పేరిట కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సంస్థలో నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, సంబంధిత నియామక మండలి ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు చేసే హామీలను అస్సలు నమ్మవద్దని సూచించారు. అడ్డదారులు ఆశ్రయించడం వల్ల జీవితాలు దెబ్బతింటాయని, కష్టపడి చదివి ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించాలన్నారు. నిరుద్యోగులే తమ భవిష్యత్తుకు బాధ్యత వహించాలని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొలువుల పేరుతో అమాయకులను మోసం చేసే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.