బిర్సా ముండా స్ఫూర్తితో ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేయాలి  

  • కిషన్ నాయక్ పిలుపు 

విశ్వంభర, మహబూబాబాద్ :  జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు   దళిత , గిరిజన , ప్రజా సంఘాలతో  కలిసి ఆదివాసి పోరాటాలకు స్ఫూర్తి దాత బిర్సా ముండా వర్ధంతిని ఘనంగా  గిరిజన సామాజిక చైతన్య వేదిక   రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు .  కార్యక్రమాన్ని ఉద్దేశించి  కిషన్ నాయక్ మాట్లాడుతూ, ఈ దేశంలో ఆదివాసుల అస్తిత్వం కోసం జల్ జంగిల్ జమీన్ అడవి పై సర్వ హక్కులు ఆదివాసులకే  ఉండాలని బ్రిటిష్ దోపిడి పాలకులకు  వ్యతిరేకంగా ఆదివాసుల విముక్తి కోసం గెరిల్లా మార్గంలో పోరాటం నిర్వహించి బ్రిటిష్ పాలకులను  గడగడలాడించిన గొప్ప విప్లవ జ్యోతి బిర్సా ముండా అని , అంతేకాకుండా  బిర్సామండ ఆశయంతో ఆదివాసి రాజ్యాంగంలో కల్పించిన హక్కులను చట్టాలను రక్షణ కోసం ,   పోరాటాలకు ఆదివాసులు గిరిజనులు సిద్ధం కావాలని కిషన్ నాయక్  గుర్తు చేసారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు చిత్తారి  సోమన్న, కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డల రామ్మూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు  బానోత్  వెంకన్న, డిఎస్ఎఫ్ పోలేపాక వెంకన్న, యాదవ సంఘం నాయకులు గణేష్ ,గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగోత్ కిషన్, సురేష్ లు తదితరులు పాల్గొన్నారు .

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-struggle-for-tribal-rights-should-be-done-in-the/article-16426

Tags: