హసన్ పర్తిలో మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ ప్రారంభం
విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ జిల్లా హాసన్ పర్తి గ్రామంలో ఒయాసిస్ మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ జననీ యాత్రను ముఖ్య అతిధులుగా విచ్చేసిన కాజిపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి,స్థానిక మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ రిబ్బన్ కట్ చేసి మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సంతాన లేమితో బాధపడుతున్న భార్యాభర్తలకు ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒయాసిస్ ఫర్టిలిటీ జననీ యాత్రలో ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా నేరుగా మొబైల్ బస్ సౌకర్యంతో మహిళలకు,పురుషులకు ఫ్రీగా వైద్య పరీక్షలు నిర్వహించడం వారి సేవా గుణానికి నిదర్శనం అన్నారు.ప్రతీ మహిళకు మాతృత్వం ఒక వరమని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ డాక్టర్ కావ్య రావు జలగం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు హసన్ పర్తి గ్రామంలో ఒయాసిస్ మొబైల్ ఫర్టిలిటీ జననీ యాత్ర విజయవంతం అయిందని తెలిపారు. పిల్లలు కావాల్సిన దంపతులు ఇద్దరు మా హనుమకొండ బ్రాంచ్ ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ను సంప్రదించాలని కోరారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ నందు భార్యాభర్తలకు ఉచిత కన్సల్టెషన్,ఏ. ఎం.హెచ్. పరీక్షలు, సీమేన్ అనాలిసిస్,వైవల్ మార్కర్స్, ఉచిత స్కానింగ్ చేస్తారని తెలిపారు. అంతేగాక ఐ. వి.ఎఫ్ పరీక్షలపై 30000 రూపాయల డిస్కౌంట్, ఐ. యూ.ఐ. పరీక్షలపై 1999 రూపాయల డిస్కౌంట్ ఉంటుందని, త్రి నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ రాజేష్ కోరారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.