మున్సిపల్ పాలకవర్గం డంపు యార్డు పరిశీలన
విశ్వంభర, హుస్నాబాద్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పలు పారిశుధ్య, భద్రతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ పాలకవర్గం, కమిషనర్ కలిసి పట్టణంలోని పొడి చెత్త సేకరణ కేంద్రం, కంపోస్ట్ యార్డు, డంపు యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘం వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. చెత్తను కలిపి ఇవ్వడం వల్ల వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తి పర్యావరణ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు డంపు యార్డులో జరుగుతున్న వ్యర్థాల నిర్వహణ విధానాన్ని పరిశీలించి పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. పట్టణంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణకు పురపాలక సంఘం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఎలక్ట్రీషియన్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను చైర్‌పర్సన్ పంపిణీ చేశారు. విద్యుత్ పనులు నిర్వహించే సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ టి.మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు చెన్నబోయీన అనూష, బూరుగు లత, కోండ రజిత,పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు, సావుల మంజుల,పూదరి వరప్రసాద్,కేశవేని రమేష్, గాదెపాక రవీందర్, బత్తుల స్వరూప,గోపగోని శోభన్ బాబు, కో-ఆప్షన్ సభ్యుడు ఎం.డి హసన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.