చేయూత పెన్షన్స్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

విశ్వంభర, నల్లకుంట : చేయూత పెన్షన్స్ పంపిణీకి వెంటనే తేదీ ప్రకటించి అమలు ప్రారంభించాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డేఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో కన్వీనర్ కాటమోని వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదు నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్స్ అమలులో ఆలస్యం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారికి త్వరితగతిన పెన్షన్స్ మంజూరు చేసి, స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. పెన్షన్స్ అమలు విషయంలో ఆలస్యం కొనసాగితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-decision-should-be-taken-immediately-on-pensions/article-16432

Tags: