పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. డ్రైనేజీలపై లేదా?
- ఠాకూర్ కాలనీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ: నరకప్రాయంగా మారిన స్థానికుల జీవితాలు
విశ్వంభర , మేడ్చల్: కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఠాకూర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాలనీలోని మ్యాన్‌హోల్స్ నుండి డ్రైనేజీ నీరు నిరంతరం రోడ్లపైకి పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడం వలన కాలనీ అంతటా విపరీతమైన దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో దోమలు, ఈగలు చేరి రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అదే మురుగునీటి పక్కనే ఆడుకోవాల్సి వస్తోందని, దీనివల్ల వారు త్వరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలనీలో అడుగు పెట్టాలన్నా, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలన్నా ఈ వాసన భరించలేకపోతున్నామని వారు వాపోతున్నారు. గత రెండేళ్లుగా ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి విన్నవిస్తూనే ఉన్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంటి పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు, డ్రైనేజీ క్లీన్ చేయించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. చెప్పి చెప్పి మాకు విసుగొచ్చింది అని ఒక స్థానికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఠాకూర్ కాలనీని సందర్శించి ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తమను ఈ నరకప్రాయమైన దుర్వాసన నుండి కాపాడాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.