గ్రామ పంచాయతీలకు ‘సంక్రాంతి’ కానుక!

రూ. 277 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రామ పంచాయతీలకు ‘సంక్రాంతి’ కానుక!

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పల్లెల అభివృద్ధి, స్థానిక అవసరాల కోసం ఏకంగా రూ. 277 కోట్ల భారీ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పల్లెల అభివృద్ధి, స్థానిక అవసరాల కోసం ఏకంగా రూ. 277 కోట్ల భారీ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. పండుగ పూట గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, ఇతర అత్యవసర పనులకు నిధుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజాప్రతినిధులకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

పెండింగ్ పనులకు మోక్షం.. 
గత కొంతకాలంగా నిధుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీలకు ఈ విడుదలైన సొమ్ము పెద్ద ఊరటనివ్వనుంది. ఈ నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయి. పంచాయతీల రోజువారీ నిర్వహణ ఖర్చులకు వెసులుబాటు కలుగుతుంది. పారిశుధ్య కార్మికుల వేతనాలు, ఇతర అత్యవసర చెల్లింపులకు మార్గం సుగమం కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ నిధులు విడుదల చేయడం వల్ల గ్రామాల్లో పనులు వేగవంతం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయండి