సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: జగ్గారెడ్డి
* కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వం..
* పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత
* నా జీవితమంతా ప్రజలే...రాజకీయాలే.
* నేను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రాను,నన్ను ఎవరు పిలువొద్దు.
* పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించాలని చూస్తే వారిపై వేటు తప్పదు.
విశ్వంభర, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం లో కార్యకర్తలు, నాయకులకు జగ్గారెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు సంవత్సరాలు మనం అధికారం లో ఉంటాం, మరో ఐదేళ్లు అధికారం లో తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
మీ వార్డ్ లలో క్యాండేట్ లను రిజర్వేషన్ లకు అనుగుణంగా అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకోండని సూచించారు.గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ లు గా పోటీ చేసి గెలిచిన వారు, ఓడిపోయిన వారు పూర్తి బాధ్యత తీసుకోండని చెప్పారు.బిసీ ఉన్న వార్డ్ లు, ఎస్సీ అయిన, ఎస్సీ ఉన్న వార్డ్ లు బిసీ అయిన అంతకుముందు ఆ వార్డుల్లో పోటీ చేసినా, గెలిచిన వారు బాధ్యత తీసుకోని అభ్యర్థులను గెలిపించాలని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వమనీ,పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
నేను టీఅర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నా సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ చైర్మెన్ లు టీఅర్ఎస్ గెలిపించానని గుర్తు చేశారు.
నా కష్టంతో నేను బీజేపీ నుండి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా గెలిచా..
నా జీవితమంతా ప్రజలే,రాజకీయాలే అని జగ్గారెడ్డి తెలిపారు.అలాగే నేను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రాను నన్ను ఎవరు పిలువొద్దన్నారు.భవిష్యత్తులో ఎమ్మెల్యే కానున్న నిర్మలా జగ్గారెడ్డిని ఈ ఎన్నికల ప్రచారానికి పిలవాలని సూచించారు. జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణ ప్రజలు విశ్వసిస్తారని ఆయన అన్నారు. ఆమె గెలుపు కోసం చేసే వాగ్ధానాలన్నీ తానే నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. తన జీవితంలో తాను పోలీసులను ఎదిరించి రాజకీయం చేశానని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తాను ఎప్పుడూ రాజకీయం చేయలేదని అన్నారు.అధికారంలో ఉన్నామని పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూడవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఇబ్బంది పెట్టవద్దని అన్నారు.మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలైన చేయండి,ఆ వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డినీ అడిగి చేయించే బాధ్యత నాది అని ఆయన చెప్పారు. సదాశివపేట మున్సిపాలిటీకి,సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, వాసిం భాయ్ ఇంచార్జ్ లుగా ఉంటారని,సంగారెడ్డి మున్సిపాలిటీకి తోపాజి అనంత్ కిషన్, చిదృప్ప రఘు, జార్జ్, బొంగుల రవి ఇంచార్జ్ లుగా ఉంటారని తెలిపారు.ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించాలని చూస్తే వారిపై వేటు ఖాయమని జగ్గారెడ్డి హెచ్చరించారు.



