అది గుంతలు తవ్వే స్కీమ్..అందుకే మార్చాం: కిషన్ రెడ్డి

అది గుంతలు తవ్వే స్కీమ్..అందుకే మార్చాం: కిషన్ రెడ్డి

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఒకే ప్రాంతంలో ఏడాది తర్వాత ఏడాది గుంతలు తవ్వడం తప్ప ఎలాంటి శాశ్వత ప్రయోజనం లేకుండా పనులు జరిగాయని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విస్తృత మార్పులు, సంస్కరణలలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆధునీకరించామని మంత్రి తెలిపారు.

మన్రేగా పథకాన్ని పూర్తిగా కొత్త దిశలో కొనసాగిస్తున్నామని, ఇకపై దీనిని ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ’ (వీబీ-జీ రామ్ జీ) పేరుతో అమలు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, ఉపాధి హామీని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి రైతులకు కూడా దీర్ఘకాలిక లాభాలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పని కల్పించలేని పరిస్థితుల్లోనూ అర్హులకు పరిహారం అందేలా విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Read More చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్

ఉపాధి హామీ పథకం అనేది కేవలం గుంతలు తవ్వే కార్యక్రమం కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశ అభివృద్ధికి దోహదపడే కీలక పథకమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీలకు అమలు అధికారాలను పెంచామని, పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజుల వరకు విస్తరించామని తెలిపారు. రాష్ట్రాలకు అదనపు నిధులు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దివ్యాంగులు మరియు వృద్ధులకు కూడా ఉపాధి హామీ కార్డులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తంగా, ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా, ప్రయోజనకరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Tags: