- కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం కాంగ్రెస్‌కే చెల్లింది
- - మేడిగడ్డకు మరమ్మతులు చేయడం చేతగాక డ్రామాలు
- రెండు పిల్లర్లు బాగుచేయడానికి రెండేండ్ల సమయమా?
- వివేక్, ఉత్తమ్, జూపల్లివి అవగాహన లేని మాటలు
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
విశ్వంభర, సిద్దిపేట:-బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కించపరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముక్తేశ్వరుడి శిక్ష తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. కటిక చీకట్లో కారు దీపం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం కాంగ్రెస్‌కే చెల్లిందని మండిపడ్డారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయడం చేతగాక, తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్ల మరమ్మతులకు రెండేండ్ల సమయం సరిపోలేదా అని ప్రశ్నించారు. కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డను రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే పని తక్కువ ప్రచారం ఎక్కువలా ఉందని ఎద్దేవా చేశారు. ఎల్‌నినోతో కరువచ్చే ప్రమాదముందని హడావుడిగా కాకుండా ముందస్తుగా మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. 150మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదిరిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, నిజంగానే ఒప్పందముంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి తట్టెడు మట్టైనా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. 30నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపారని నిలదీశారు. మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారని, మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, పనులన్నీ నిర్వీర్యమవుతాయని చెప్పినట్టు గుర్తుచేశారు. అప్పుడు అగ్రిమెంట్ అయింటే తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా చేవెళ్ల దగ్గర పనులెందుకు ప్రారంభించారని సూటిగా ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయని మంత్రి జూపల్లి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి సుందిళ్లకు నీళ్లు తెస్తామంటున్నాడు.. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్టుతో నీళ్లు తెస్తామంటున్నాడు.. ఎవరు చెప్పేది నిజమన్నారు. బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పించాలని మొన్న సీఎం అన్నారని, అగ్రిమెంట్ జరిగాక మళ్లీ మహారాష్ట్రను ఒప్పించడం ఎందుకని ప్రశ్నించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మంత్రిగా నేను అధికారులతో వెళ్లి మహారాష్ట్ర సీఎంను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందని అక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.82కోట్లతో పూర్తవుతుందా ప్రశ్నించారు. అప్పట్లో ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీలో మూడు చోట్లా కాంగ్రెస్సే అధికారంలో ఉందని, అప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టకుండా సమయాన్ని వృథా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.2300 కోట్ల బిల్లులు లేపారని, కరప్షన్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఫైర్ అయ్యారు. ల్యాండ్ అక్విజిషన్‌కు రూ.3780కోట్లు ఖర్చు చేశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.11వేల కోట్లు పూర్తయ్యాయని పచ్చి అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ రాసిందని, ఆ విషయాన్ని దాచిపెట్టి, సగం లేఖను మాత్రమే చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్లకు శంకుస్థాపన చేస్తే.. అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞమని విమర్శించిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడని చెప్పారు. మండుటెండల్లో కూడా నిమిషానికి మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తుందని, తుమ్మిడిహెట్టి వద్ద 2వేల క్యూసెక్కులు మాత్రమే పోతుందని తెలిపారు. 2వేలు ఎక్కడ? 6400 క్యూసెక్కులు ఎక్కడని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, వెలేటి రాధాకృష్ణ, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.