డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణ కోసమే "హెల్త్ మిషన్-100" : టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణ కోసమే

విశ్వంభర, సంగారెడ్డి: తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం "హెల్త్ మిషన్-100" (100 రోజుల ఆరోగ్య మిషన్) అనే బృహత్తర కార్యక్రమం ద్వారా ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తుందని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.  సోమవారం జిల్లా గ్రామణాభివృద్ధి శాఖ, కంది మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో లో కంది గ్రామ పిహెచ్సి లో ఏర్పాటు చేసిన వైద్య పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో సాధారణంగా వచ్చే బిపి, సుగర్, థైరాయిడ్, రక్త హీనత వంటి 30 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారన్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రతీ మహిళ కు క్యుఆర్ కోడ్ తో కూడిన "డిజిటల్ హెల్త్ కార్డ్" రూపొందించి ప్రభుత్వ పోర్టల్ లో భద్రపరుస్తారని వివరించారు. దీనివల్ల భవిష్యత్తు లో ఏ ఆసుపత్రికి వెళ్ళిన వారి పూర్తి ఆరోగ్య చరిత్ర అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలకు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు.ఈ కార్యక్రమం లో  కంది గ్రామ సర్పంచ్ శ్రీరామ్, ఉప సర్పంచ్ ఖాన్, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/health-mission-100-tgiic-chairperson-nirmala-jaggareddy-for-dwakra-womens-health/article-15379

Tags: