అమృత్ పనులు వేగవంతం చేయాలి

అమృత్ పనులు వేగవంతం చేయాలి

  • : మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద రూ.316 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. సోమవారం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కె. వెంకటేశ్వర్‌రావుతో కలిసి 33, 44, 45, 46, 47 వార్డుల్లో జరుగుతున్న యూజీడీ పనులను ఆమె పరిశీలించారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో రిస్టోరేషన్ సక్రమంగా చేయక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఛైర్‌పర్సన్ తెలిపారు. సీసీ రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. తవ్విన ప్రాంతాల్లో వెంటనే మట్టిని సమతలీకరించి రోడ్లను పునరుద్ధరించాలని సూచించారు.
రానున్న వర్షాకాలానికి ముందే, అలాగే పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా మ్యాన్‌హోల్స్ నిర్మాణాన్ని వేగవంతం చేసి, డ్రైనేజ్ నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కె. వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ పట్టణంలో యూజీడీ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు మ్యాన్‌పవర్‌ను పెంచాలని ఆదేశించారు. తవ్విన ప్రాంతాల్లో వెంటనే రిస్టోరేషన్ పనులు చేపట్టి రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు. యూజీడీ పనుల సమయంలో వాటర్ సప్లై పైప్‌లైన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దెబ్బతిన్నచో వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.మ్యాన్‌హోల్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన లెవెలింగ్‌తో నిర్మించాలన్నారు. ఒప్పంద గడువులోపు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు ఫీల్డ్‌లో ఉండి నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ సి ఎచ్ హన్మంత రెడ్డి, ఇఇ యం. కిరణ్, డి. ఇ లు సత్యారావు, రమాదేవి, అనిల్ మున్సిపల్ కౌన్సిలర్ లు కుమ్మరి కుంట్ల వేణు, నాగుల వాసు, గుణగంటి హైమ సతీష్, ఏ ఇ తిరుమల్లయ్య, ఎస్  ఎస్. ఆర్. ప్రసాద్, రంజిత్, వర్క్ ఏజెన్సీ కాంట్రాక్టుర్లు తదితరులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/amrits-work-should-be-expedited/article-15383

Tags: