భవన నిర్మాణ  కార్మికులకు రూ.9వేలు పెన్షన్ ఇవ్వాలి 

విశ్వంభర, చిక్కడపల్లి  : భవన నిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.9,000 పెన్షన్ ఇవ్వాలి. ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి అని తెలంగాణ ప్రగతిశీల భవన ,ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. హన్మేశ్ పేర్కొన్నారు. హెచ్-74 టీయూసీఐ అనుబంధం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హైదరాబాదు వీఎస్టీ పార్క్ నుంచి చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు కార్మికులతో ప్రదర్శన నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కార్మికులకు జీవన భద్రత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్మికులకు నెలకు రూ.9,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీమా పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలు అధికంగా వసూళ్లు చేస్తున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని కోరారు. సహజ మరణ పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు. కార్మికులకు వైద్య సేవలు ఈఎస్ఐ ద్వారా అందించాలని, పెళ్లి కానుక, ప్రసూతి సాయం రూ.1 లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కేఎస్ ప్రదీప్, నల్లన్న, గోసు పుల్లయ్య, సహాయ కార్యదర్శులు రాజు, నర్సింహ, కోశాధికారి ఆడెపు శంకర్, నాయకులు రాము, కోల్ల వెంకటన్న, బాలు, వెంకన్న, చెన్నప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rs-9-thousand-pension-should-be-given-to-construction-workers/article-15863

Tags: