కొనుగోలు కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
విశ్వంభర,నెల్లికుదురు: మండలం లోని మునిగలవీడు గ్రామానికి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెల్లికుదురు పిహెచ్సి ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్థానిక సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు రైతులకు,హమాలీ కూలీలకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎండలో పనిచేసినా,ప్రయాణం చేసిన ఓఆర్ఎస్ పాకెట్ ను అవసరమైన మేర నీటిలో కలుపుకొని తాగి ఎండ దెబ్బకు గురికాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి డా.రమ్య మాట్లాడుతూ ఎండ,వడదెబ్బ తో డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.ఎండలో పనిచేయాల్సి వస్తే తలపైన కాటన్ దుస్తులతో తలపాగా,శరీరానికి దుస్తులు ధరిస్తే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపిఎం నరేంద్ర కుమార్,సీసీలు,జీపీవో,విద్యుత్ ఉద్యోగులు,హమాలీ లేబర్ తదితరులు పాల్గొన్నారు.