చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు 

చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు 

  • మహిళా హత్య ఘటన స్థలం పరిశీలించిన ఎస్పి నరసింహ 

విశ్వంభర, సూర్యాపేట: భూ సంబంధిత తగాదాలు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి, చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు హత్యలు చేస్తే జైలు శిక్షలు తప్పవని ఎస్పీ నర్సింహ హెచ్చరించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మలపెనపహాడ్ గ్రామంలో  భూతగాదాల నేపథ్యంలో జరిగిన మహిళ హత్య ఘటన స్థలాన్ని  ఎస్పీ నరసింహ  పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం సిబ్బంది, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించాయి. నేరానికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసును వేగంగా దర్యాప్తు చేసి కోర్టుకు పంపించాలని అధికారులకు సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి చెందిన సురిగి సైదులు సొంత అక్క అంజమ్మకు ఇద్దరికీ భూవివాదం నెలకొని ఉంది, దీనికి సంబంధించి గతంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది, ఇరువర్గాలను కూడా బైండోవర్ చేసి హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అక్క ఉంటే భూమి నాకు దొరకదని అక్కను తప్పిస్తే త్వరగా భూమి తన సొంతం చేసుకోవచ్చని భావించిన నిందితుడు సైదులు సోమవారం రోజు ఉదయం కరువు పని నిమిత్తం వెళుతున్న అంజమ్మ పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడని ఎస్పీ అన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ భూ సంబంధిత తగాదాలు ఉంటే కోర్టుల సమక్షంలో, పెద్దమనుషుల సమక్షంలో చట్టపరంగా పరిష్కరించుకోవాలి అని చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు చేసిన హత్యలు చేసిన జైలుకు వెళ్లడం తప్పదు అని అన్నారు. గతంలో గరిడేపల్లి మండలంలో పొనుగోడు గ్రామంలో భూతగాదాలకు సంబంధించిన జరిగిన హత్య కేసులో నలుగురు నేరస్థులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిందని గుర్తు చేశారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. నేరానికి పాల్పడ్డ సైదులు పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు చేయడం జరిగింది త్వరితగతిన కేసు దర్యాప్తు చేసి నేరస్తులను శిక్ష పడేలా చేస్తామని బాధ్యత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్సైలు మహేష్, ఐలయ్య, గోపికృష్ణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/violation-of-the-law-is-punishable/article-15427

Tags: