రేజోనేన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల హాస్టల్ విద్యార్థుల రెజో తరంగ్ ఫెస్ట్.- .చైర్మన్ లెక్కల రాజిరెడ్డి వెల్లడి
విశ్వంభర హనుమకొండ జిల్లా : - వరంగల్ ములుగు రోడ్డు లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో వరంగల్ జిల్లాలో పేరు గాంచిన రాజస్థాన్ కోటాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు రేజోనేన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల హాస్టల్ విద్యార్థుల రెజో తరంగ్ 2025 ఫెస్ట్ ను రెండో రోజు గురువారం అట్టహాసంగా నిర్వహించినట్లు రెజోనేన్స్ కళాశాలల ఛైర్మెన్ లెక్కల రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శంబాల సినిమా హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్,దర్శకుడు యుగందర్ యామి,నిర్మాతలు,ఏసీపీ అధికారులు హాజరయ్యారని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి ఫెస్ట్ నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహభావం,సోదర భావం పెంపొందుతుందని తెలిపారు.అనంతరం అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.హీరో ఆది,హీరోయిన్ అర్చన అయ్యర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.



