శివభక్త మార్కండేయ దేవాలయం లో రాపోలు ప్రత్యేక పూజలు

 శివభక్త మార్కండేయ దేవాలయం లో రాపోలు ప్రత్యేక  పూజలు

విశ్వంభర, రంగారెడ్డి జిల్లా :-  అబ్దుల్లాపూర్ మెట్ మండలం రాగన్నగూడ గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రధమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక 
రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ హాజరై స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్  జెల్ల పర్వతాలు, కార్యదర్శి కర్నాటి అశోక్ సాదరంగా ఆహ్వానించి ఆలయ పూజారుల చేత వేదఆశీర్వచనం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  రాగన్నగూడ పద్మశాలి సంఘం అధ్యక్షులు గంజి సంజీవ రాయుడు, పద్మశాలి ప్రముఖులు  సామల మనోహర్, సామల స్వప్న, కోట పాండు, గంజి గణేశ్ , సామల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: