భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
On
- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
విశ్వంభర, మహేశ్వరం : పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ, మంకాల్ డివిజన్ 192 సర్వేనంబర్, శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో భూములు కోల్పోయిన దళితులు, రైతులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ను కలిశారు. 2005లో 184 ఎకరాల లావోణి పట్టా భూములను ప్రభుత్వం సేకరించింది. రూ.20లక్షలు పరిహారాన్ని వెంటనే అందించారు, కానీ 300 గజాల ప్లాట్లను ఇంకా ఇవ్వలేదని లక్ష్మారెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే రెవెన్యూ అధికారులతో మాట్లాడిన కేఎల్ఆర్ వీలైనంత త్వరగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంకాల్, తుక్కుగూడ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



