గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
On
విశ్వంభర,పెద్ద శంకరంపేట: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కందుకూర్ రవీందర్. మండల యూత్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డ మల్లేశం. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రమేష్ లు అది వారం తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు తూప్రాన్ లోని తాత పావనపల్లిలో గాంధీ విగ్రహణం ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వం విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.. లేనిపక్షంలో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.



